హైదరాబాద్ కి ఆరంజ్ తెలంగాణ కి రెడ్ జోన్ అని హెచ్చరిక.

0
426

వాన పడాలని అందరు కోరుకుంటారు , కానీ మరి మనుషుల జీవితాలని తలకిందులు చేసేలా పడాలని ఎవరు కోరుకోరు కూడా. కానీ బుధవారం నుంచి ఇప్పటికికూడా కురుస్తున్న వానకి మనుషుల జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయి.

ఈ వర్షం కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు నిండా మునిగిపోయి కరెంటు లేక తాగే మంచి నీరు అందుబాటులోలేక నరకం అంటే ఏంటో చూస్తున్నారు.

ఇదిలా ఉండగా వాతావరణ శాఖ ఈ వర్షాల మీద స్పష్టత ఇచ్చింది. ఈ వర్షాలు శనివారం వరకు మరింత విపరీతంగా పడే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆరంజ్ జోన్ గా, తెలంగాణ లోని జిల్లాలకు మరింత భారీగా ఉరుములు మెరుపులతో కురిసే వాన పడబోతుందని రెడ్ జోన్ గా వెల్లడించారు.

అయితే బుధవారం నుంచి ఇప్పటిదాకా కురిసిన వానని పరిశీలిస్తే నగరంలోని సెరిలింగంపల్లి ఆసిఫ్‌ నగర్ ఉప్పల్ , కూకట్ పల్లి , చార్మినార్, బాలానగర్ వంటి ప్రదేశాలలో 10 మి.మీ నుంచి 15 మి.మీ లో వర్షపాతం నమోదు కాగా కుర్మగుడలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల సమీపంలో 18.8 మి.మీ ల వర్షపాతం చోటు చేసుకుంది అని అధికారికంగా ప్రకటించారు.

ఇదిలా ఉండగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జగ్తిఅల్, కుమురాంభీమ్ , ఆసిఫాబాద్, మాంచెరియల్, పెద్దాపల్లి మరియు నగరంలోని పలు ప్రదేశాలలో భారీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి అని స్పష్టం చేసింది.

ఏదేమైనా ఈ వారం రోజులు తెలంగాణలోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here