సుమారు ఒక దశాబ్దం తర్వాత తెరుచుకున్న ఉస్మాన్ సాగర్ గేట్లు

0
518
Osman-Sagar-gates-opened
Osman-Sagar-gates-opened

తెలంగాణ లో ఎక్కడ చుసిన వర్షాలు , వర్షంలో కొట్టుకొనిపోతున్న మనుషులు, విలువైన కార్లు , ఎన్నో ఘోరాలు చూడాల్సి వస్తుంది. అయితే ఈ వర్షాలు ఇంకా 3 రోజులు వరకు భారీగా కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరక శాఖ వెల్లడించగా ప్రజలు మరియు అధికారుల ఒత్తిడి మేరకు దశాబ్దకాలం నుంచి మూసేసిన ఉస్మాన్ సాగర్ గేట్లు తెరవబడాయి.

ఇప్పటికే నగరంలోని లోతట్టు ప్రాంతాలు వర్షం వళ్ళ నిండా మునిగి ప్రజలను చిత్ర హింసలు పెడుతున్నాయి. దానికి తోడు ఇంకా రెండు రోజులు వర్షం యొక్క తీవ్రత ఉంటుంది అని తెలిశాక ఉస్మాన్ సాగర్ యొక్క గేట్లు తీయకుంటే ప్రజల ప్రాణాలకే ప్రమాదం అని భావించి గేట్లు తీశారు.

దీనికంటే ముందే 2.97 టీఎంసీ కెపాసిటీ గల హిమాయత్ సాగర్ లోని 5 గేట్లు ఎత్తివేశారు. ప్రస్తుతానికి దానియొక్క నీటి మట్టం 1,763.50 అడుగులగా నమోదయింది. కావున వేరే మార్గం లేక ఉస్మాన్ సాగర్ లోని 2 గేట్లు ఈరోజు అధికారికంగా ఎత్తివేశారు. దీనియొక్క కెపాసిటీ 3.90 టిఎంసి లు ఉండగా ప్రస్తుత నీటి మట్టం 1,784.90 అడుగులుగా రికార్డు అయ్యింది.

ఇదిలా ఉండగా వీటి యొక్క ఇన్ ఫ్లో దాదాపు 500- 600 క్యూసెక్స్ గా నమోదయ్యాయి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ నీటి సరఫరా మరియు మురుగునీటి బోర్డు వారు వాతావరణ శాఖ యొక్క సూచనా మేరకు ఈ పని చేస్తున్నారని చెప్పగా, హిమయాత్ సాగర్ , ఉస్మాన్ సాగర్ మరియు ముసి పరిసర ప్రాంతాల్లోని మనుషులని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here