స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప చిత్రం తో ప్రేక్షకుల ముందు వస్తున్నడని అందరికి తెలిసిన విషయమే. ఇప్పటికే ఈ సినిమా టీజర్ కట్ ప్రేక్షకులందరిని
ఎక్కడ తగ్గేది లే అనేసి అలరించేసింది .
ఈ సినిమా లో బన్నీ సరసన రష్మిక నటించబోగా ,ముఖ్య పాత్రలలో సునీల్ , జగపతి బాబు, ప్రకాష్ రాజ్ ,అనసూయ నటిస్తున్నారు. అయితే ఈ సినిమా 2 భాగాలలో విడుదల చేయబోతున్నారు.
ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఐటం సాంగ్ కి చిత్ర బృందం సన్నీ లియోన్ ని కలిసినట్లు, దానికి సన్నీ ఒపుకున్నట్లు విశ్లేష వర్గాలు చెప్తున్నాయి. సన్నీ కంటే ముందు ఈ ఐటెం సాంగ్ కి దిషా పటాని, నోరా ఫతేహి మరియు ఇతరుల పేర్లు అనుకున్న సుకుమార్ సన్నీ నే పర్ఫెక్ట్ అనేసరికి చిత్ర బృందం సన్నీ పాపని బన్నీ సరసన ఐటం సాంగ్ చేయడానికి ఒపించారు.
అయితే పుష్ప మొదటి భాగం అతి త్వరలో విదుదల అవబోతుంది. షూటింగ్ కూడా దాదాపు పూర్తయింది. త్వరలో చిత్ర బృందం సినిమా రిలీజ్ డేట్ ప్రకటించబోతున్నారు.
సన్నీ , బన్నీ కలిసి డాన్స్ ఎలా వేయబోతున్నారో, అది ఎంత హాట్ గా ఉండబోతుందో ఇప్పటినుంచే అభిమానులు ఊహలో మునిగిపోయారు.