లాక్ డౌన్ లో ఎవరికీ చెప్పకుండా సినిమా తీసేసిన మహానుభావుడు

0
982

ఈ కరోనా రెండవ దశ సమయం లో అస్సలు బయటికి వెళ్లలేని పరిస్థితిలో జనాలు ఉంటె ఆ దర్శకుడేమో 24 రోజులో సినిమా తీసేశాడు. అయన మరెవరో కాదు మన మహానుభావుడే మారుతీ.

మారుతీ ఎవరికీ చెప్పకుండా 24 రోజులో సంతోష్ శోభన్ ని హీరోగా పెట్టి , మెహ్రీన్ ని హీరోయిన్ గా పెటేసి సినిమా తీసేసి ఆ సినిమాకి టైటిల్ గా మంచి రోజులొచ్చాయి అని కూడా పెటేసి పోస్టర్ రిలీజ్ చేసి అందరికి షాక్ ఇచ్చేశాడు మారుతీ.

అసలు లాక్ డౌన్ లో ఏ డైరెక్టర్ ఇంత సాహసం చేయలేదు. కొంతమందేమో కథలు రాసుకుంటూ కాలక్షేపం చేస్తుంటే, మరికొందరు హీరోలకి కథలు చెప్పుకుంటూ రెండవ దశని పూర్తిచేశారు. మారుతీ ఈ రేంజ్ షాక్ ఇస్తాడని ఎవరు ఊహించలేదు.

నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి చెపేశాడు లాక్ డౌన్ లో తాను ఎలా ఇదంతా చేయగలిగాడు అని. ఆ ప్రెస్ మీట్ లోనే క్యారెక్టర్ ఇంట్రో కూడా వదిలి ప్రజలను మరోసారి తనదైన మార్క్ తో అలరించేశాడు.

త్వరలో సెన్సార్ పనులు పూర్తిచేసుకొని విడుదల తేదిని కూడా ప్రకటిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here