లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన తహశీల్ధార్ :- తెలంగాణ.

0
566
జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లాలోని కాటారం తహసీల్దార్ సునీత రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు
జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లాలోని కాటారం తహసీల్దార్ సునీత రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు

జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లాలోని కాటారం తహసీల్దార్ సునీత రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు

ఈ మధ్యకాలంలో ఎక్కడ చుసిన లంచం లేనిదే మంచం దిగేలాలేరు ప్రభుత్వ ఉద్యోగులు. వారానికి ఒకరు లంచం తీసుకుంటూ పట్టుబడుతున్నారు. ఈసారి ఈ లంచాదారుల లిస్టులో తెలంగాణలోని కటారాం తహశీల్దార్ ఎం. సునీత ప్రవేశించింది.

గురువారం రోజున ఎసిబి బృందం ఎం. సునీత ని 2 లక్షలు లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇపుడు మనం దీని వెనకాల ఉన్న కథ గురించి మాట్లాడుకుందాం.

కటారం మండలంలోని సుందర్‌రాజుపేటకు చెందినవాడు హరికృష్ణ , ఇతని పట్టాదర్ పాస్‌బుక్ జారీకి సంబంధించిన ఫైల్‌ను ప్రాసెస్ చేయడానికి సునీత 2 లక్షల లంచం డిమాండ్ చేయడం జరిగింది. ఎవరికీ తెలియకుండా హరికృష్ణ ఎసిబి బృందానికి ఈ వార్త చెప్పగా , సునీత ఆఫీస్ కి రాకముందే ఎసిబి బృందానికి సంబందించిన మనుషులు మారువేషాలు వేసుకొని ఆఫీస్ లో వేరే వేరే చోటున ఉండి సునీత కోసం ఎదురు చూస్తున్నారు.

అనుకున్నట్టే సునీత ఆఫీస్ కి వచ్చింది, హరికృష్ణ కూడా 2 లక్షలు తీసుకొని వచ్చాడు. డబ్బులు వస్తున్నాయి అని సునీత ఆనందపడి చేతిలో 2 లక్షలు పట్టుకున్న మరునిమిషం లోనే ఎసిబి బృందం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అరెస్ట్ చేసి, డబ్బుని స్వాధీనం చేసుకున్నారు.

కోర్ట్ లో హాజరు చేపించే రోజు కోసం హరికృష్ణ మరియు ఎసిబి బృందం ఎదురు చూస్తున్నారు. కోర్ట్ లో జడ్జిగారు ఎం చెప్పబోతున్నారన్నది ఇపుడు ఆశక్తికరంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here