లెక్కలో 12,943 టీచర్ల పోస్ట్లు ఖాళీలు కానీ వాస్తవానికి 1,384 పోస్టులే భర్తీ
మన రాష్ట్రంలో ఏవి సమయానికి మారవు, కానీ ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య మాత్రం పూటకొక మాట చెప్తున్నారు. కేంద్రానికి పంపేటప్పుడు 12,943 పోస్ట్లు అని సగౌరవంగా పంపిన, ప్రభుత్వం ఇపుడు మాత్రం 1,384 పోస్టులే ఖాళీలు భర్తీ చేస్తాం అని నిరుద్యోగుల హృదయాలు బద్దలయేలా చెపేశారు. దీనికి గల కారణాలు ఎన్నో ఉన్నాయి, అందులో ఒకటే పిల్లల సంఖ్యా కన్నా టీచర్లే ఎక్కువ ఉన్నారని సర్వే తెలిపింది.
ఇదిలా ఉండగా రాష్ట్ర విభజన సమయంలో ప్రతి ఏటా డీఎస్సీ పోస్టులు వదులుతాం అని హామీ ఇచ్చారు, ఇన్ని సంవత్సరాలకి ఒకసారి 8,000 పోస్టులు వదిలారు అంతే , దీనితో పాటు 12,000 కు పైగా విద్య వాలంటీర్లుగా పని చేస్తున్నారు. వీరు ప్రతి ఏటా రెన్యువల్ చేసుకోవాలి కానీ , ఈసారి అవికూడా చేసుకోలేకుండా చేశారు. దీని గల కారణం టీచర్ల పోస్టులను రేషనలైజేషన్ చేసిన తర్వాతే భర్తీ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని స్పష్టంగా తెలుస్తుంది.
ఒకవేళ రేషనలైజేషన్ తర్వాతే ఖాళీలు భర్తీ అనే వార్త నిజం అయితే అసలు టీచర్ పోస్టులే ఉండవని, ఉన్నవే ఊడిపోయే స్థితికి వచ్చేస్తాయని టీచర్ల సంఘాలు మండిపడుతున్నాయి. ఉన్నదీ ఉన్నట్లు భర్తీ చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వ విద్యాసంస్థలు సుమారు 26,050 ఉండగా అందులో 20 లక్షల మంది చదువుతున్నారు. వీటిలో మొత్తం టీచర్ల సంఖ్య 1.07 లక్ష ఉంది. ఎటు చుసిన టీచర్ల సంఖ్య నే ఎక్కువ ఉండటం దానికి తోడు ప్రభుత్వ విద్య సంస్థలో పిల్లలు ఎక్కువ సంఖ్యలో రాకపోవడం తో సుమారు 1,500 కు పైగా విద్య సంస్థలు తీసేసి రేషనలైజేషన్ చేయాలనే ఆలోచనలోనే ప్రభుత్వం ఉన్నందుకు ఇంకా నోటిఫికెషన్స్ వదలడం లేదు అని స్పష్టంగా అర్ధం అవుతుంది.
ఉన్న ఉద్యోగాలే, ఉన్న పాఠశాలలే తీసేస్తున్నారంటే, ఇంకా కొత్తగా పోస్టులు ఎక్కడనుంచి వస్తాయి అని నిరుద్యోగులు ఆవేదన పడుతున్నారు.
చూడాలి మరి నిరుద్యోగుల ఆవేదనని , ధర్నాలని ప్రభుత్వం
ఏ విధంగా స్పందిస్తుందో..