మనందరికీ తెలుసు ఇటీవలే శిల్ప శెట్టి యొక్క భర్త అయినా రాజ్ కుంద్రా ని పోలీసులు అరెస్ట్ చేశారు. దానికి గల కారణం కూడా సమాజానికి తెలిసిందే. యాప్స్ లో పోర్నోగ్రఫిక్ కంటెంట్ కి కారణం ఇతనే అని. చాల ఏళ్ళ నుంచి ఇతను పోర్న్ సినిమాలు ఇల్లీగల్ గా చిత్రీకరించి యాప్స్ లో విడుదల చేస్తున్నారని ఇతనితో పాటు 11 మందిని సాక్ష్యాలతో సహా పట్టుకున్నారు.

రాజ్ కుంద్రా ని అరెస్ట్ చేసి జైలులో పెట్టిన స్పందించని భార్య , ఈరోజు సోషల్ మీడియా ని వేదికగా ఉపయోగించుకొని తన జీవితం గురించి పుస్తకంలోని వాఖ్యలను లింక్ చేస్తు చెప్పకనే చెపింది. ఆ పుస్తకంలోని వాక్యాలు ఈ విధంగా ఉన్నాయి ‘ మనం ఎక్కడో ఊహలో ఉండాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నువ్వు ఎక్కడ ఉన్నవో అదే నువ్వు. కానీ ముందు జాగ్రత్త తో జీవితం కొనసాగాలి ‘ అనే సారాంశం తో ఈ వాక్యాలు ఉండగా. తన జీవితంలో ఎన్నో సవాళ్ళను ఎదురుకొని ఈ స్థాయిలో ఉన్నానని, సవాళ్లు నాకు కొత్త ఎం కాదు, భవిష్యత్తులో కూడా సవాళ్ళను ఎదిరించడానికి సిద్ధం అని చెపింది.
దీని బట్టి సోషల్ మీడియా లో శిల్ప శెట్టి తన బాధను ప్రజలకు అర్ధం అయ్యేలా వివరించింది. పెళ్ళయి 12 సంవత్సరాలు అయ్యింది, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇపుడు భర్త రాజ్ కుంద్రా మీద ఉన్న నిందా నిజం అని తెలిసింది.
ప్రస్తుతం తాను భవిష్యత్తు పైన ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది , దానితో పిల్లల భవిష్యత్తు కూడా ముడిపడి ఉండబోతుంది.
చూడాలి మరి పుస్తకం వాఖ్యలను సోషల్ మీడియా లో పెట్టిన అంత సులువుగా జీవితంలో నిర్ణయాలను తీసుకోలేము కదా. చూడాలి మరి శిల్ప శెట్టి ఎం చేయబోతుందో.