దేశమంతటా బిగ్ బాస్ అభిమానులే. బిగ్ బాస్ వస్తుందంటే చాలు టైం లేకున్నా కుదిరించుకొని మరి చూస్తారు జనాలు.
అయితే ప్రతి సంవత్సరం ఒక సీజన్ తోనే వచ్చే బిగ్ బాస్ ఇప్పటినుంచి ప్రతి సంవత్సరం రెండు సార్లు ప్రేక్షకులని అలరించబోతుంది. అది ఎలా అనుకుంటున్నారా..
సాధారణంగా హిందీ లో బిగ్ బాస్ హోస్ట్ గా సల్మాన్ ఖాన్ చేస్తుంటారు.ఇపుడు కూడా ఆయననే అనుకోండి. కాకపోతే ఇది టీవీ కి సంబందించిన బిగ్ బాస్ విషయం.
ఇదిలా ఉండగా బాలీవుడ్ వాళ్ళు కొత్తగా ఓటీటీ లో కూడా బిగ్ బాస్ సీజన్ ప్రారంభించాలని అనుకున్నారు. టీవీ లో వచ్చేదానికి ఓటీటీ లో వచ్చేదానికి సుమారు రెండు వారాల గ్యాప్ ఉండబోతుందని విశ్లేష వర్గాలు చెప్తున్నారు.
టీవీ లో సల్మాన్ ఖాన్ కనిపించగా ఓటీటీ లో హోస్ట్ గా కరన్ జోహార్ కనిపించబోతున్నారు. కరన్ జోహార్ కి కూడా బిగ్ బాస్ అంటే ఇష్టమని, అయన కుటుంబం అంతా కలిసి, చూసి ఆనందిస్తారని చెప్పారు.
ఇపుడు ఓటీటీ బిగ్ బాస్ కి ఆయనే హోస్ట్ గా చేయబోతున్నారు. చూడాలి మరి ఓటీటీ లోని బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరు? ఓటీటీ లో ఎలా ఉండబోతుంది అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది.