
మహబూబ్ నగర్ లో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ కి అవసరమైతే వాహనం ఏర్పాటు చేస్తాం.. కర్ణాటక వెళ్లి అక్కడి పరిస్థితులను, తెలంగాణలో ఉన్న పరిస్థితులను పరిశీలించాలి
తెలంగాణలో పాలన బాగుంది, సంక్షేమ పథకాలు బాగున్నాయి అని తమని తెలంగాణలో కలపమని అన్న బీజేపీ రాయచూరు ఎమ్మెల్యేని బండి సంజయ్ కలిసి రావాలి
కర్ణాటకలో ఉన్న బీజేపీ ప్రభుత్వ అసమర్థ పాలనను చూసి సిగ్గు తెచ్చుకోవాలి
ఏ ముఖం పెట్టుకొని పాలమూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు బండి సంజయ్
పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వలేమని చెప్పేందుకా.. నదీ జలాల్లో వాటా తేల్చకుండా ఏడేళ్లలో శిఖండి సంస్థను ఏర్పాటు చేసి కేంద్రం తాత్సారం చేస్తున్నందుకా..?
పాలమూరులో గద్వాల – మాచర్ల వరకు లైను లేకుండా లేట్ చేస్తున్నందుకా.. ఏం చెప్పేందుకు బండి సంజయ్ పాలమూరులో పాదయాత్ర చేస్తున్నారు?
బండి సంజయ్ మాటలు మత విద్వేషాన్ని రెచ్చగొట్టేలా చేసే వ్యాఖ్యలు తప్పా ఇంకేం లేదు
ప్రజలకు కేంద్రం ఏం చేసిందో చెప్పాలి
అధికారంలోకి వస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యం అంటున్న బండి సంజయ్ కి కేంద్రంలో అధికారంలో ఉన్నది ఎవరో తెలవదా?
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశవ్యాప్తంగా ఇవన్నీ ఉచితంగా ఇస్తే అడ్డుకుంటున్నారా..? పక్కనున్న కర్ణాటకలో బీజేపీ ఏమైనా ఇస్తున్నదా..?
సొల్లు పురాణం, అబద్ధపు మాటలు తప్పించి ఇంకేం లేదు