ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ , ముంబై అత్యధికంగా ఉద్యోగాలు అందించే పలు నగరాలూ సర్వే

0
565
Bengaluru, Hyderabad, Delhi, Mumbai to lead in jobs creation
Bengaluru, Hyderabad, Delhi, Mumbai to lead in jobs creation

ఇటీవలే టీమ్‌లీజ్ సర్వీసెస్ అనే సంస్థ చేసిన సర్వే ఆధారంగా మన భారత దేశంలోనే అత్యధికంగా ఉద్యోగాలను అందించే నగరాలుగా ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ , ముంబై వంటి పేర్లు నమోదు అయ్యాయి. ఈ సర్వేలో భాగంగానే దాదాపు 620 కి పైగా కంపెనీల వివరాలు, వారి దగ్గర పని చేస్తున్న వర్కర్స్ గురించి, వారు తీసుకునే జీతాల గురుంచి క్షున్నంగా పరిశీలించాక టీమ్‌లీజ్ వారు చేసిన సర్వే వివరాలను అధికారికంగా విడుదల చేసింది.

ఇందులోని భాగంగానే మెట్రో నగరాలుగా పేరు తెచ్చుకున్న బెంగళూరు , ముంబై , ఢిల్లీ వంటి ప్రదేశాలలో కొత్త ఉద్యోగాలు కల్పించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని , కరోనా రెండవ దశ తర్వాత ఈ నగరాలూ ముందుగా మళ్ళీ అభివృద్ధిలోకి వస్తాయి అని వెల్లడించారు.

సేల్స్ అండ్ టెక్నాలజీ మరియు టెక్ ఉద్యోగాలకు ముందుగా ప్రాధాన్యత ఉండబోతుంది. ఎందుకంటే బిజినెస్ అభివృద్ధి అవ్వాలి దాని ద్వారానే ఇతర పనులలో వేగం పెరుగుతుంది అని చెప్పారు.వీరి జీతాల గురించి మాట్లాడుకుంటే పెర్మనెంట్ గా పనిచేసే ఉద్యోగులకి మరియు తాత్కాలికంగా పనిచేసే ఉద్యోగులకి 5-10 శాతం మాత్రమే తక్కువ అని చెప్పారు.

కరోనా రెండా దశ పూర్తవగానే ఢిల్లీ , బెంగళూరు , హైదరాబాద్, ముంబై ప్రదేశాలలో త్వరగా ఉద్యోగాలు అభివృద్ధిలోకి వచ్చేస్తాయని దీనికి గల కారణం కరోనా టీకా వేసుకున్న జనాభా ఎక్కువ ఈ నగరాలలోనే ఉన్నారని సర్వే తేల్చి చెపింది.

దానికి తోడు ఈ కరోనా వళ్ళ నష్టపోని కంపెనీస్ లో ఐటి , ఇ-కామర్స్ , హెల్త్‌కేర్ వంటి రంగాలు ఉన్నాయి . అలాగే బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ , టెలికాం మాన్యుఫ్యాక్చరింగ్ మరియు ఇంజనీరింగ్ వంటి సంస్థలు తక్కువ నష్టపోయినట్లు తెలిపారు. పై చెప్పబడిన సంస్థలు రెండవ దశ ఎత్తివేయగానే, అతి తక్కువ సమయంలోనే మళ్ళీ అభివృద్ధిలోకి వచ్చేస్తాయని వెల్లడించారు. దీనికి పూర్తి విరుధంగా రిటైల్, లైఫ్ స్టైల్ వంటి సంస్థలు ఉన్నాయి, అంటే ఇలాంటి సంస్థలు నష్టాలలోనుంచి బయటికి రావడానికి చాలానే సమయం పడుతుంది.

ఇదిలా ఉండగా గత ఏడాదితో పోల్చుకొని ఇపుడు లాభాలో ఉన్న రంగాలుగా బ్యాంకింగ్ , ఆర్థిక సేవలు మరియు భీమా, మరియు ఐటి సంస్థలు అని వివరించారు.

సర్వే చేసిన అన్ని రంగాలలో కొత్త ఉద్యోగాలను కల్పిస్తున్నారని తెలిపి ఉదాహారానికి వాటి పేర్లుగా మర్చంట్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్ , మరియు టీమ్ లీడ్ ఇన్ సేల్స్ , ఇలా కొత్త పేర్లతో కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయని సర్వే ద్వారా ప్రజలకి వెల్లడించారు.

చూడాలి మరి ఈ సర్వే కారణంగా నిరుద్యోగుల కోరికలు తీరి ఉద్యోగులుగా మారబోతున్నారో లేదో అని..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here