
– బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు ఆదర్శంగా.. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయంపై పోరాడి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నది
- సాధించుకున్న తెలంగాణలో అభివృద్ధి ఉద్యమాన్ని ముందుకు తీసుకొనిపోతున్నది
- ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్నిహెచ్ఐసీసీలో నిర్వహించబోతున్నాం
- తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ, శాసన మండలి, పార్లమెంట్ ప్రతినిధులతో పాటు
కార్పొరేషన్ చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు, సహకార బ్యాంకు అధ్యక్షులు, గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు, పార్టీ కార్యవర్గ సభ్యులు, మహిళా కోఆర్డినేటర్లు, జెడ్పీటీసీలు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, మున్సిపాలిటీల చైర్మన్లు, మండల, పట్టణ శాఖ అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఈ సమావేశానికి హాజరవుతారు
- 27వ తేదీన 10 గంటల లోపు సమావేశ ప్రాంగణానికి అహ్వానిత నాయకులు చేరుకోవాలి
- 10 గంటల నుంచి 11 గంటలకు ఆహ్వానితుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది
- 11 గంటలకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు పార్టీ జెండాను ఎగురవేసి సమావేశాన్ని ప్రారంభిస్తారు, సమావేశం 5 గంటల వరకు కొనసాగుతుంది
- పార్టీ తరఫున ఆహ్వానించిన వారిని మాత్రమే రావాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది పార్టీ ప్రతినిధుల సభ మాత్రమేనని గుర్తుంచుకోవాలి
- ప్రతి గ్రామపంచాయతీలో గ్రామ కమిటీ పార్టీ జెండాను ఎగుర వేయాలి. గ్రామంలో ఆవిర్భావ దినోత్సవం రోజు పార్టీ కమిటీ సమావేశమై.. తెలంగాణ రాష్ట్రానికి టిఆర్ఎస్ పార్టీనే శ్రీరామ రక్ష అనే విషయాన్ని మరోసారి చాటి చెప్పాలి.. తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడే పార్టీ కేవలం టిఆర్ఎస్ పార్టీ అని తెలపాలి.
- ప్రతి పట్టణ వార్డులోనూ టీఆర్ఎస్ పార్టీ కమిటీల ఆధ్వర్యంలో బస్తీలో జెండాలు ఎగుర వేయాలి..
- సమావేశానికి రాని పార్టీ శ్రేణులన్నీ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా పార్టీ ఆవిర్భావ సంబరాలను చేసుకోవాలి
- ఒక పార్టీకి 21 సంవత్సరాలు నిండడం ఒక కీలకమైన మైలురాయి.. ఈ నేపథ్యంలో సంబరాలను ఘనంగా జరుపుకోవాలని విజ్ఞప్తి
- ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో పార్టీ ఆవిర్భావం సందర్భంగా జెండా కార్యక్రమాలు జరగాల్సిన కార్యక్రమాలను సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులదే
- ఈ సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లు నిర్వహణకు సంబంధించి కొన్ని కమిటీలను ఏర్పాటు చేశాం
- హైదరాబాద్ నగర అలంకరణకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులు బాధ్యత తీసుకుంటారు
- పార్టీ ఆవిర్భావ సంబరాలకు సంబంధించిన స్థానిక ఎమ్మెల్యేలు జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు జరుగుతాయి, వాటిలో పాల్గొనాల్సిందిగా పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి
- పార్టీ సమావేశం సందర్భంగా నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా నగర పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, జిహెచ్ఎంసి వంటి అధికారులతో సమన్వయం చేసుకుంటున్నాం
తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ – 2022 కమిటీల వివరాలు
ఆహ్వాన కమిటీ:
- శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, మంత్రి
- శ్రీ రంజిత్ రెడ్డి గారు, ఎంపీ
- శ్రీ గాంధీ గారు, ఎమ్మెల్యే
- శ్రీమతి విజయ లక్ష్మి గారు, హైదరాబాద్ మేయర్
- శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, ఎమ్మెల్యే
సభా వేదిక ప్రాంగణం అలంకరణ:
- శ్రీ గోపీనాథ్ గారు, ఎమ్మెల్యే
- శ్రీ బాలమల్లు గారు, చైర్మన్
- శ్రీ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, చైర్మన్
ప్రతినిధుల నమోదు, వాలంటరీ:
- శ్రీ శంభిపూర్ రాజు గారు, ఎమ్మెల్సీ
- శ్రీధర్ రెడ్డి రావుల, చైర్మన్
- మన్నే కృషంక్, చైర్మన్
పార్కింగ్ :
- శ్రీ కేపి వివేక్ గారు, ఎమ్మెల్యే
- శ్రీ బండి రమేష్ గారు, పార్టీ జనరల్ సెక్రెటరీ
- శ్రీ బొంతు రామ్మోహన్ గారు, హైదరాబాద్ మాజీ మేయర్
ప్రతినిధుల భోజనం:
- శ్రీ మాధవరం కృష్ణారావు గారు, ఎమ్మెల్యే
- శ్రీ నవీన్ కుమార్ రావు గారు, ఎమ్మెల్సీ
- సుధీర్ రెడ్డి – మాజీ ఎమ్మెల్యే
తీర్మానాల కమిటీ:
- శ్రీ మధుసూదనాచారి గారు, ఎమ్మెల్సీ
- శ్రీ పర్యదా కృష్ణమూర్తి గారు
- శ్రీనివాస్ రెడ్డి – మాజీ ఎమ్మెల్సీ
మీడియా కమిటీ:
- శ్రీ బాల్క సుమన్ గారు, ఎమ్మెల్యే
- శ్రీ భాను ప్రసాద్ గారు, ఎమ్మెల్సీ
- కర్నె ప్రభాకర్ గారు, మాజీ ఎమ్మెల్సీ
- గువ్వల బాలరాజు గారు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే