ఈ మధ్య కాలంలో ఎక్కడ చుసిన ఎపుడు విన్న ఒకటే మాట తెలంగాణాలో జరిగే ఉపఎన్నికల హడావిడే కనబడుతుంది. అన్ని పార్టీలు తమ అభ్యర్థుల్ని అధికారికంగా ప్రకటించారు, ఒక టీఆర్ఎస్ పార్టీ తప్ప. ఎంతో మంది అభ్యర్థుల పేరు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి కానీ ఎటువంటి సరైన సమాధానం దొరకలేదు.
ఇటీవలే పీసీసీ మాజీ కార్యదర్శి అయినా పాడి కౌశిక్‌రెడ్డి ని సభాముకంగా టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు కేసీఆర్. ఈ కార్యక్రమంలో పాల్గున్న ప్రతి ఒక్కరు ఇంకా ఉపఎన్నికల పదవి పాడి కౌశిక్‌రెడ్డి కె సొంతం అని భావించెశారు, కానీ కెసిఆర్ మాట్లాడిన మాటల్లో ఎక్కడ ఉపఎన్నికల ప్రస్తావన తీసుకొని రాలేదు.
ఎంతసేపు పాడి కౌశిక్‌రెడ్డి ని రాజకీయాల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది. అతనొక మంచి క్రికెటర్ అని రాష్ట్ర స్థాయి పదవి వస్తుందని చెప్పగానే తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ పదవి కౌశిక్‌రెడ్డి కి ఇచ్చే ఉద్దేశంలో ఉన్నట్లు చెప్పకనే చెప్పేశారు.
దీన్ని బట్టి ప్రజలందరికి ఎం అర్ధం అయింది అంటే టీఆర్ఎస్ పార్టీ ఉపఎన్నికలలో నిలబడే అధ్యక్షుడు ఎవరనేది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. మొత్తానికి కేసీఆర్ గారు బుధవారం జరిగిన మీటింగ్ లో కౌశిక్‌రెడ్డి గురించి , హుజూరాబాద్ గురించే చెప్పడం జరిగింది. వేచి చూడాలి ఉపఎన్నికల అధ్యక్షుడిగా కెసిఆర్ గారు ఎవరిని నియమించబోతున్నారో.